https://oktelugu.com/

Jobs: ఇండియన్‌ ఆర్మీలో 41 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో?

Jobs: ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 41 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇండియన్ ఆర్మీ లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, ట్యాలీ క్లర్క్‌, కుక్‌, ఎంటీఎస్, స్టెనో గ్రేడ్‌-2, అసిస్టెంట్‌ అకౌంటెంట్‌, కార్పెంటర్‌, రెగ్యులర్‌ లేబరర్‌ ఇతర ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది. పదో తరగతి, ఇంటర్, బీకామ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 6, 2022 5:43 pm
    Follow us on

    Jobs: ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 41 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇండియన్ ఆర్మీ లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, ట్యాలీ క్లర్క్‌, కుక్‌, ఎంటీఎస్, స్టెనో గ్రేడ్‌-2, అసిస్టెంట్‌ అకౌంటెంట్‌, కార్పెంటర్‌, రెగ్యులర్‌ లేబరర్‌ ఇతర ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది.

    పదో తరగతి, ఇంటర్, బీకామ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇంగ్లీష్ లో టైపింగ్ నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    ది కమాండెంట్‌, హెడ్‌ క్వార్టర్స్‌, సెకండ్ ఫ్లోర్‌, నావ్‌ భవన్‌ బిల్డింగ్‌, కమాని మార్గ్‌, బల్లార్డ్‌, ముంబయి, 400001 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. 2022 సంవత్సరం మార్చి నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

    http://employmentnews.gov.in/newemp/home.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.