https://oktelugu.com/

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షలు వాయిదా..?

కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 10,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏపీ విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలవుతుండటంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 25, 2021 / 09:40 AM IST
    Follow us on

    కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 10,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏపీ విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.

    అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలవుతుండటంతో పాటు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని జగన్ సర్కార్ కు ప్రతిపాదనలను పంపింది. మరో మూడు రోజుల్లో జగన్ సర్కార్ పదో తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

    జగన్ సర్కార్ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను కరోనా రోగుల చికిత్స కోసం క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. అందువల్ల విద్యాశాఖ పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని భావించినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా కొన్ని రాష్ట్రాలు ఫలితాలను కూడా ప్రకటించడం గమనార్హం.

    పదో తరగతి పరీక్షలు, ఫలితాల విడుదల ఆలస్యమైతే విద్యార్థులకు ఇంటర్ తరగతులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రధానోపాధ్యాయులను పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కులను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

    పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడగనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పదో తరగతిలో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవాలంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేయాల్సి ఉంటుంది. పదో తరగతి పరీక్షల విషయంలో జగన్ సర్కార్ నిర్ణయం కోసం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.