ట్విటర్ పై కేంద్ర ప్రభుత్వం దాడులు

సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దిగజారుడు కార్యక్రమాలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ, గుర్గావ్ లలో ఉన్న ట్విటర్ కార్యాలయాలపై ఢిల్లీకి చెందిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హఠాత్తుగా సోదాలు జరిపారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండగా పోలీసులు మాత్రం ఆయా కార్యాలయాలపై దాలు చేయడం గందరగోళానికి గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్ కు మద్య వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓ టూల్ […]

Written By: Srinivas, Updated On : May 25, 2021 9:46 am
Follow us on


సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దిగజారుడు కార్యక్రమాలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ, గుర్గావ్ లలో ఉన్న ట్విటర్ కార్యాలయాలపై ఢిల్లీకి చెందిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హఠాత్తుగా సోదాలు జరిపారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండగా పోలీసులు మాత్రం ఆయా కార్యాలయాలపై దాలు చేయడం గందరగోళానికి గురి చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్ కు మద్య వివాదం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓ టూల్ కిట్ ను రూపొందించి బీజేపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందంటూ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ లాంటి ట్వీట్లకు మ్యానిపులేటెడ్ మీడియా అనే ట్యాగ్ ను జత చేస్తోంది. ఫేక్ న్యూస్ పోస్టు చేయడంలో నిపుణుడైన సంబిత్ పాత్ర ఈ టూల్ కిట్ పై నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ట్విటర్ అకౌంట్కు మ్యానిపులేటెడ్ మీడియా అని ట్యాగ్ పెట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి కోపం తెప్పించింది.

కాంగ్రెస్ పార్టీ విధానం కేంద్ర ప్రభుత్వ అహాన్ని దెబ్బతీస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్విటర్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. నంబిత్ పాత్రపై తెలుసుకోవడానికి పోస్టు చేసిన ట్వీట్ మ్యానిపులేటెడ్ ఆధారాల కోసం వచ్చామని పేర్కొన్నారు. పోలీసుల తీరు సోషల్ మీడియాలో చర్ననీయాంశం అవుతోంద. బీజేపీ ఉద్దేశపూర్వకంగా ట్విటర్ కార్యాలయాలపై దాడులకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్వతంత్ర కార్యాలయాలపై దాడులు చేయడం సరైంది కాదని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నంబిత్ పాత్రపై పలు చోట్ల కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ గడ్ లలోనూ కేసులు నమోదు చేశారు. అక్కడి పోలీసుల ఆయనకు సమన్లు జారీ చేస్తే కరోనా రోగులకు సేవలు అందించే ప్రయత్నంలో బిజీగా ఉన్నానని రాలేనని లాయర్ ద్వారా సమాచారం పంపారు. పేక్ న్యూస్ ద్వారా కాంగ్రెస్ పై నిందలు వేయడం ద్వారా తప్పించుకోవాలని బీజేపీ అనుకుంటోందన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.