
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ వచ్చినా అది అందరికీ అందడం లేదు. ఫలితంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తగ్గించడానికి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటించినా దాని వ్యాప్తి ఆగడం లేదు. లాక్ డౌన్ విధించినా కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది.
కరోనా నివారణకు కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు. రెండు రకాల మందులు కలిపితే కాక్ టెయిల్ అవుతుంది. అది ఏ మందు అయినా సరే కరోనా నివారణ కోసం కూడా ఇలా ఓ కాక్ టెయిల్ తయారు చేశారు. రెండు రకాల మందులు అంటే మెడిసిన్స్ కలిపి తయారు చేసిన ఈ కాక్ టెయిల్ ఇప్పుడు ఇండియాలోకి వచ్చింది. దీని ఖర్చు రూ.59,750 గా నిర్ణయించారు.
కాసిరిమాట్, ఇమ్డివిమాబ్ అనే రెండు రకాల మెడిసిన్ లు కలిపి ఈ కాక్ టెయిల్ ను తయారు చేసి దానికి యాంటీ బాడీ కాక్ టెయిల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ కాక్ టెయిల్ ను ఇండియాలో సిప్లా, రోచ్ ఇండియా కంపె నీలు కలిపి అందిస్తున్నాయి. ఈ రోజు లక్ష ప్యాకెట్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఒక్కో ప్యాకెట్ ఇద్దరు రోగులకు పనికి వస్తుంది. అంటే వీటితో రెండు లక్షల మంది రోగులకు అందించవచ్చు.
మన శరీరంలో తయారు కావాల్సిన యాంటీ బాడీస్ ను బయట నుంచి అందిస్తుంది. అవి మన శరీరంలోకి వెళ్లి కరోనా వైరస్ తో పోరాడతాయి. తక్కువ లేదా ఓ రేంజ్ వరకు లక్షణాలు ఉన్న వారికి ఈ మందు పని చేస్తుందని రుజువు అయింది. అందుకే భారత్ ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చారు. ఇంకో మందు వస్తోంది. ఇప్పటికే ఆనందయ్య మందు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ఇలా కరోనా నివారణకు అన్ని రకాల మందులు వస్తే దాన్ని జయించడం పెద్ద విషయమేమి కాదని తెలుస్తోంది.