https://oktelugu.com/

IARI Recruitment 2022: ఐకార్ లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఉద్యోగాలకు ఎవరు అర్హులంటే?

IARI Recruitment 2022: ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనుభవం ఉన్న్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఢిల్లీలో ఉన్న ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భారీస్థాయిలో భర్తీ చేయడానికి సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 31,000 రూపాయల వేతనం లభించనుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 1, 2022 / 10:14 AM IST
    Follow us on

    IARI Recruitment 2022: ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనుభవం ఉన్న్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఢిల్లీలో ఉన్న ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భారీస్థాయిలో భర్తీ చేయడానికి సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 31,000 రూపాయల వేతనం లభించనుంది.

    IARI Recruitment 2022

    ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ రీసెర్ఛ్ ఫెలో ఉద్యోగ ఖాళీ 1 ఉండగా ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీ 1, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగ ఖాళీలకు సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐఆర్-యూజీసీ నెట్/గేట్ అర్హత ఉండటంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

    Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?

    35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 31,000 రూపాయలతో పాటు ఇతర ఆలవెన్స్ లను చెల్లించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీతో పాటు అనుభవం ఉన్నవాళ్లు అర్హులు అని చెప్పవచ్చు. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు అనుభవం ఉన్న ఉద్యోగులు అర్హులు అవుతారు.

    35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18,000 రూపాయల వేతనం, ఇతర ఆలవెన్స్ లు లభిస్తాయి. https://iari.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: Union Budget Of India 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?