
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. ఆరు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఐబీపీఎస్ విడుదల చేసిన నోటిఫికేషన్ లోని ఉద్యోగాలు అన్నీ టెక్నికల్ ఉద్యోగాలే కావడం గమనార్హం. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే..?
2021 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. విడుదలైన నోటిఫికేషన్ ద్వారా అనలిస్ట్ ప్రోగ్రామర్ – విండోస్, అనలిస్ట్ ప్రోగ్రామర్ – ఫ్రంట్ ఎండ్, ఐటీ ఇంజినీర్ (డేటా సెంటర్), ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 100 మార్కులకు జరిగే ఆన్ లైన్ పరీక్షలో 50 మార్కులకు ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు, 50 మార్కులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ(ఐటీ), ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) చదివి టెక్నికల్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది.