ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-సీ సివిలియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగ ఖాళీలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: తెలంగాణలో అంగన్‌వాడీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?
రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉండగా మెరిట్, కేటగిరీ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ నెల 3వ తేదీన ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://indianairforce.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త.. పరీక్ష లేకుండా జాబ్స్..?
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాల కోసం స్టెనోగ్రాఫర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.