Army Jobs: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ప్రస్తుతం ఎన్నో ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలలో ఉద్యోగ ఖాళీల భర్తీల భర్తీ జరుగుతోంది. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉండటం గమనార్హం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 40 ఉద్యోగ ఖాళీలు ఉండగా కంప్యూటర్ సైన్స్ 8, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, మెకానికల్ 5, ఐటీ 3, అర్కిటెక్చర్ 1 , ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 1, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 1, టెలిక్యూనికేషన్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1, ఏరోనాటికల్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ప్రొడక్షన్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 1, ఆప్టో ఎలక్ట్రానిక్స్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ 1 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
Also Read: అనంతపురం జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?
డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఇంటర్వూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: డిగ్రీ పాసైన విద్యార్థులకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?