https://oktelugu.com/

Naga Chaitanya: కూతురునిచ్చి నాగచైతన్యను బాలయ్య ఎందుకు అల్లుడిగా చేసుకోలేదో తెలుసా? కారణమిదీ!

Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని, నందమూరి ఫ్యామిలీల గురించి తెలియని వారండరు. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలివచ్చాక ఇండస్ట్రీకి ఈ రెండు కుటుంబాలే దిక్సూచిలా మారాయి. అన్న ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావులు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కలిసి మెలిసి ఉండేవారు. వీరి వారసులు కూడా అంతే స్నేహభావంతో మెలుగుతూ వచ్చారు. అక్కినేని నాగశ్వర్ రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి నాగార్జున అడుగుపెట్టాడు. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా […]

Written By: NARESH, Updated On : December 9, 2021 4:37 pm
Follow us on

Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని, నందమూరి ఫ్యామిలీల గురించి తెలియని వారండరు. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలివచ్చాక ఇండస్ట్రీకి ఈ రెండు కుటుంబాలే దిక్సూచిలా మారాయి. అన్న ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావులు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కలిసి మెలిసి ఉండేవారు. వీరి వారసులు కూడా అంతే స్నేహభావంతో మెలుగుతూ వచ్చారు.

Naga chaitanya

Naga Chaitanya

అక్కినేని నాగశ్వర్ రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి నాగార్జున అడుగుపెట్టాడు. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కింగ్ నాగార్జునగా కీర్తించబడుతున్నారు.

నాగార్జున కంటే ముందుగానే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. బాలనటుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన బాలయ్య తండ్రితగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ ట్రెండ్ ఏర్పరుచుకున్న బాలయ్య అభిమానులచే ‘నటసింహం’గా కొనియాడబడుతున్నాడు. వీరిద్దరు కూడా టాలీవుడ్లో ఎలాంటి ఈగోలు లేకుండా స్నేహంగా మెలుగుతూ వస్తున్నారు.

ఎవరి ఇంట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నా మరొకరు వెళుతూ తమ స్నేహబంధాన్ని బలపర్చుకునేవారు. నందమూరి, అక్కినేని ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధం కాస్తా బంధుత్వం మారితే చూడాలని ఇండస్ట్రీతోపాటు అభిమానులు కోరుకున్నారు. బాలయ్య ఇద్దరి కుమార్తెలో ఒకరిని నాగార్జున కుమారుడి ఇచ్చే చేస్తారనే టాక్ టాలీవుడ్లో కొంతకాలం నడిచింది.

ఈక్రమంలోనే బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె తేజస్విని అక్కినేని నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని బాలకృష్ణ భావించారట. ఇదే విషయాన్ని నాగార్జునతో బాలకృష్ణ ప్రస్తావించగా ఆయన సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్నే నాగార్జున చైతూకు చెప్పగా సమంతతతో ప్రేమాయణాన్ని బయటపెట్టాడు.

Also Read: Akhanda Movie: బాలయ్య “అఖండ” సినిమా ఒటీటీ రిలీజ్ ఎప్పుడంటే…

ఈ విషయంలో బాలకృష్ణకు తెలియడంతో నాగ చైతన్యను బాలకృష్ణ రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్. ఆ తర్వాత బాలకృష్ణ తన రెండో కుమార్తెను తేజస్విని వైజాగ్ గీతం సంస్థల యాజమాని కుమారుడు భరత్‌‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఇక చైతూ-సమంతలు కూడా ప్రేమవివాహాం చేసుకున్నారు.

టాలీవుడ్లో నాగచైతన్య, సమంతలు క్యూట్ కపూల్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఏమైందో ఏమోగానీ కేవలం నాలుగేళ్లలోనే వీరిద్దరు విడాకులు తీసుకొని పెళ్లి బంధాన్ని పుల్ స్టాప్ పెట్టారు. ఆ విధంగా నాగచైతన్య బాలయ్యకు అల్లుడి అయ్యే మంచి అవకాశాన్ని  చేజార్చుకున్నాడని తెలుస్తోంది.

Also Read: Pushpa Movie: “పుష్ప” నుంచి ‘ఊ అంటావా… ఊహు అంటావా’ అంటూ వచ్చేస్తున్న సమంత…