Hindustan Shipyard Jobs 2022: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?

Hindustan Shipyard Jobs 2022: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వైజాగ్ లో ఉన్న ఈ సంస్థ 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. సివిల్‌, అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో […]

Written By: Kusuma Aggunna, Updated On : March 3, 2022 5:06 pm
Follow us on

Hindustan Shipyard Jobs 2022: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వైజాగ్ లో ఉన్న ఈ సంస్థ 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

Hindustan Shipyard Jobs 2022

సివిల్‌, అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో పాటు టెక్నికల్‌, కమర్షియల్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. బీఈ/ బీటెక్‌, గ్రాడ్యుయేషన్, డిప్లొమా కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు తెరపైకి? అసలు కథేంటి?

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. జనరల్‌ మేనేజర్, హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, వైజాగ్, 530005 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 20వ తేదీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 52,000 రూపాయల నుంచి 2,20,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. https://www.hslvizag.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

Also Read: కేసీఆర్ ఢిల్లీ టూర్.. టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటం

Recommended Video: