
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 21 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం హెచ్‌సీఎల్ నుంచి తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2, ఎలక్ట్రీషియన్ కమ్ లైబ్రేరియన్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 15 వరకు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు కోల్‌కతాలో పనిచేయాల్సి ఉంటుంది. https://www.hindustancopper.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా ఐటీఐ (ఎలక్ట్రీషియన్), ఎన్‌సీవీటీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
3 సంవత్సరాల అనుభవం ఉండి వైర్‌మెన్ లైసెన్స్ కూడా కచ్చితంగా ఉండాలి. 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా నెలకు రూ.18,180 నుంచి రూ.37,310 వరకు వేతనం లభిస్తుంది. ఎలక్ట్రీషియన్ కమ్ లైబ్రేరియన్ ఉద్యోగ ఖాళీ 1 ఉండగా ఈ ఉద్యోగానికి కూడా ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి ఉండే అర్హతలే ఉండాలి.
అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని కోల్ కతా అడ్రస్ కు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.