
హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 206 ట్రెయినీ అప్రెంటిస్ పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, ఇతర ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జులై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.hecltd.com/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 206 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రిషియన్ 20, ఫిట్టర్ 40, మెషినిస్ట్ 16, వెల్డర్ 40, కోపా 48, స్యూవింగ్ టెక్నాలజీ (టైలరింగ్) 42 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉంది.
2021 సంవత్సరం జులై 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. https://www.hecltd.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.