
భారత నావికా దళం సెయిలర్ అక్టోబర్ 2021 బ్యాచ్ నోటిఫికేషన్ తాజాగా జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 19వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జులై 23 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 350 ఉద్యోగ ఖాళీలలో చెఫ్, హైజీనిస్ట్, స్టీవార్డ్ పోస్టుల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఇండియన్ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 1, 2001 నుంచి సెప్టెంబర్ 30, 2004 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 14,600 రూపాయలు స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీల కోసం రూ. 21,700 నుంచి 69,100 రూపాయల వరకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి మొదట రాత పరీక్షను నిర్వహిస్తారు. ఎవరైతే రాత పరీక్షలో పాస్ అవుతారో వారికి ఫిజికల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.