HDFC Scholarship: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దేశంలోని ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కరోనా కోలుకోలేని దెబ్బ తీసిన రంగాల్లో విద్యారంగం కూడా ఒకటని చెప్పవచ్చు. కరోనా వైరస్ వల్ల ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఇలా తల్లీదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇలాంటి పిల్లలకు ప్రముఖ బ్యాంకులలో ఒకటైన హెచ్డీఎఫ్సీ తీపికబురు అందించింది.

కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ పేరుతో హెచ్డీఎఫ్సీ స్కాలర్ షిప్ ను ప్రకటించడం గమనార్హం. పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ ను ప్రకటించడం గమనార్హం. పాఠశాల, కాలేజ్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా హెచ్డీఎఫ్సీ ఈ స్కాలర్ షిప్ ను రూపొందించింది. స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు 15,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
పుస్తకాలు, ఆన్ లైన్ లెర్నింగ్ పరికరాలు, హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజును చెల్లించడం కోసం ఈ స్కాలర్ షిప్ ను వినియోగించడం జరుగుతుంది. గతేడాది జనవరి 1వ తేదీన కరోనాతో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన వాళ్లు ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. https://www.buddy4study.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో దరఖాస్తు ఫామ్ ను నింపి ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్కులు, కుటుంబ ఆర్థిక స్థితిగతులను బట్టి ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఒకసారి మాత్రమే ఈ స్కాలర్ షిప్ ను మంజూరు చేస్తారు.