Homeఎడ్యుకేషన్Degree Qualification Jobs: కేంద్రం బంపర్ ఆఫర్.. డిగ్రీ అర్హతతో నెలకు రూ.10 వేలు పొందే...

Degree Qualification Jobs: కేంద్రం బంపర్ ఆఫర్.. డిగ్రీ అర్హతతో నెలకు రూ.10 వేలు పొందే అవకాశం?

Degree Qualification Jobs: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ డిగ్రీ పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్వాతంత్ర అమృత్ మహోత్సవ్ కింద కేంద్రం ఎంఈఏ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఫస్ట్ సెషన్ ను మొదలుపెట్టింది. ఉన్నతవిద్య చదవాలని భావించే వాళ్లకు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ గా లభించనుంది. మొత్తం 75 ఖాళీలను ఈ ప్రోగ్రామ్ ద్వారా […]

Degree Qualification Jobs: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ డిగ్రీ పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. స్వాతంత్ర అమృత్ మహోత్సవ్ కింద కేంద్రం ఎంఈఏ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఫస్ట్ సెషన్ ను మొదలుపెట్టింది. ఉన్నతవిద్య చదవాలని భావించే వాళ్లకు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ గా లభించనుంది.

Degree Qualification Jobs
Degree Qualification Jobs

మొత్తం 75 ఖాళీలను ఈ ప్రోగ్రామ్ ద్వారా భర్తీ చేయనున్నారు. internship.mea.gov.in వెబ్ సైట్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 15 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Also Read: సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి కుంప‌ట్లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ కొరకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి నెల 18వ తేదీన ప్రకటిస్తారు. ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయని సమాచారం అందుతోంది.

గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీనాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అవుతారు.

Also Read: సిరిసిల్ల‌లో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ భాగోతం

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper