Scholarship: ఒకప్పుడు చదువు కోవడమే కష్టంగా ఉండేది. చదివించేందుకు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ఎంత కష్టమైనా తమ పిల్లలను చదివించాలనుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అయితే తమ పిల్లలను ఉన్నతంగా చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఉన్నంతలో విదేశాలకు పంపేందుకు కూడా వెనుకాడడం లేదు. కొందరు అప్పులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరి కలలు నెరవేరడం లేదు.
పెరుగుతున్న సంఖ్య..
విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న విద్యార్థుల ఆకాంక్షతోపాటు వెళ్లేవారు కూడా క్రమంగా పెరుగుతున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్తున్నారు. అయితే విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు స్టూడెంట్ లోన్ తీసుకుంటున్నారు. కొందరు ప్రైవేటు అప్పులు చేస్తున్నారు. అయితే ఆర్థిక సోథమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశీ విద్య అందించేందుకు కొన్ని సంస్థలు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. వాటి సహాయంతో విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు.
అద్భుతమైన స్కాలర్‌షిప్..
భారతీయ విద్యార్థులకు అటువంటి అద్భుతమైన స్కాలర్‌షిప్ ‘ఇన్‌లెక్స్ శివదాసాని స్కాలర్‌షిప్’ ఇన్‌లెక్స్ శివదాసాని ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్‌షిప్ ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తోంది. అమెరికా, బ్రిటన్, యూరప్‌లోని అగ్రశ్రేణి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పీజీ, ఎంఫిల్‌తోపాటు డిగ్రీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. 1976 నుంచే ఈ సాయం చేస్తోంది. ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి ఆరు నుంచి దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ 6పకటించింది. మార్చి 22వ తేదీ వరకు గడువు ఉంది.
రూ.82 లక్షల కంటే ఎక్కువ
ఇన్‌లెక్స్ శివదాసాని స్కాలర్‌షిప్ కింద భారతీయ విద్యార్థుల చదువు కోసం లక్ష అమెరికా డాలర్లు(సుమారు రూ.82 లక్షలు) అందతాయి. ఈ స్కాలర్‌షిప్ జీవన వ్యయాలు, ఆరోగ్య సంరక్షణ, వన్–వే విమాన ప్రయాణాలను కవర్ చేస్తుంది. ఇన్‌లెక్స్ శివదాసాని.. ఇంపీరియల్ కాలేజ్, లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్, లండన్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (కేంబ్రిడ్జ్ ట్రస్ట్), సైన్సెస్ పో, పారిస్, కింగ్స్ కాలేజ్ లండన్ (పీహెచ్‌డీ విద్యార్థులకు), హెర్టీతో ఉమ్మడి స్కాలర్‌షిప్ అందిస్తోంది.
ఈ పత్రాలు అవసరం..
స్కాలర్‌షిప్ దరఖాస్తు కోసం ఈ కింది పత్రాలు ఉండాలి.
– పాస్పోర్ట్
– రెజ్యూమ్/సీవీ
– ఫొటో
– అడ్మిషన్/ఆఫర్ లెటర్
– ఫీజు వివరాలు
– అదనపు నిధుల రుజువు
– డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల లిస్ట్
– కోర్సు సంబంధిత పోర్ట్‌ఫోలియో/లింకులు/రాత నమూనాలు
TOEFL/IELTS/GRE స్కోర్‌షీట్
– అకడమిక్ డిస్టింక్షన్, గ్రాంట్లు, స్కాలర్‌షిప్ మొదలైన వాటి గురించిన సమాచారం.
వీరు అర్హులు..
– అభ్యర్థి తప్పనిసరిగా 1994, జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలి. భారత దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందాలి.
– విదేశీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పొందితే గ్రాడ్యుయేషన్ తర్వాత కనీసం రెండేళ్లు భారత్‌లోనే ఉండాలి.
– సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, లా, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్,సంబంధిత సబ్జెక్టుల అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లో కనీసం 65%, సీజీపీఏ 6.8/10 లేదా జీపీఏ 2.6/4 అకడమిక్ గ్రేడ్ కలిగి ఉండాలి.
– అభ్యర్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అడ్మిషన్ పొంది ఉండాలి. అడ్మిషన్ ప్రూఫ్ లేకుండా స్కాలర్‌షిప్ దరఖాస్తులు పరిగణించబడవు.
– అభ్యర్థులు తప్పనిసరిగా TOEFL లేదా IELTS వంటి ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతకు సంబంధించి మరింత సమాచారం కోసం, ఇన్ లాక్స్ శివదాసాని స్కాలర్‌షిప్ పోర్టల్ www.inlaksfoundation.org/scholarships సందర్శించండి.
ఎంపిక ప్రక్రియ ఇలా..
స్కాలర్‌షిప్ కోసం అభ్యర్థులను స్వతంత్ర INLAX సెలక్ట్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ దరఖాస్తుదారులను వారి గత, ప్రస్తుత విజయాలు, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా అంచనా వేస్తుంది. అభ్యర్థులు ప్రధానంగా వారి పోర్ట్‌ఫోలియో ఆధారంగా ఆర్ట్స్ అండ్ డిజైన్ (ఫైన్ ఆర్ట్స్/పెర్ఫార్మింగ్ ఆర్ట్స్)లో స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేయబడతారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Good news for those who want to study abroad rs 83 lakhs for free
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com