Sri Chaitanya Infinity Learn : మూస విధానంలో ఎదుగుదల ఉండదు. భిన్నంగా చేస్తేనే కొత్తదనం ఉంటుంది. కొత్తదనం ఉన్నచోట ఎదుగుదల నిత్యం ఉంటూనే ఉంటుంది. అందువల్లే ఈ ప్రపంచం కొత్తదనం కోసం నిత్యం తపిస్తూ ఉంటుంది. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే పాత కొత్తల కలయికను ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టే విధంగా రూపొందించడం అనేది పెద్ద టాస్క్. ఇటువంటి విధానాలను ఎడ్యుకేషన్ సిస్టంలో అనుసంధానించడం అంత సులభమైన విషయం కాదు. కానీ దీనిని నిజం చేసి చూపించారు శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ.
దేశవ్యాప్తంగా ఎన్నో విద్యాలయాలు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య గ్రూప్ కు మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి.. ఇందులో మొత్తం 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంతమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్స్ఫర్డ్ స్థాయిలో విద్యార్థులకు విద్యాబోధన చేయించే విధంగా రూపకల్పన చేశారు. అందువల్లే జాతీయస్థాయిలో పోటీ పరీక్షలు ఏవైనా సరే.. శ్రీ చైతన్య విద్యార్థులు మాత్రమే అత్యున్నత ర్యాంకులు అందుకోగలుగుతున్నారు. నీట్, ఐఐటి, జేఈఈ, ఒలంపియాడ్.. ఇలా ఏ పోటీ పరీక్ష చూసుకున్నా సరే.. శ్రీ చైతన్య విద్యార్థులు మాత్రమే ర్యాంకులు అందుకోగలుగుతున్నారు. దీని అంతటికీ ప్రధాన కారణం శ్రీ చైతన్య అందిస్తున్న “ఇన్ఫినిటీ” విజ్ఞానమే.

పెరిగిన పోటీతో
నేటి విద్యా విధానంలో కొత్తదనం అనేది కచ్చితంగా కావాలి. బయట పోటీ ప్రపంచానికి అనుకూలంగా విద్యార్థులు మారాలి. అదంతా జరగాలంటే పాఠాలు బోధించే విధానంలో నూతనత్వం కనిపించాలి. అందువల్లే శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు అపరిమితమైన జ్ఞానాన్ని అందించడానికి ఇన్ఫినిటీ అనే ప్రోగ్రాం ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బహుశా మనదేశంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్న విద్యాసంస్థ కేవలం శ్రీ చైతన్య మాత్రమే కావడం విశేషం.
అక్కడే అంకురార్పణ
శ్రీ చైతన్య వ్యవస్థాపకులు స్వర్గీయ బిఎస్ రావు స్వతహాగా వైద్యులు. ఇంగ్లాండ్, ఇరాన్ ప్రాంతంలో సుమారు 16 సంవత్సరాల పాటు సుప్రసిద్ధ వైద్యులుగా సేవలందించారు. ఆయన భార్య డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి కూడా అక్కడే వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత వారిద్దరు ఇండియాకు వచ్చారు. తన కుమార్తెలను మంచి కాలేజీలో చేర్పిద్దామని చూస్తా ఉంటే.. ఒక్కటి కూడా ఆయనకు కనిపించలేదు. దీంతో 1986లో ఆయన శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. ముందుగా విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 1991లో బాయ్స్ జూనియర్ కాలేజీని మొదలుపెట్టారు. ప్రస్తుతం శ్రీ చైతన్య ఆధ్వర్యంలో 321 జూనియర్ కాలేజీలు ఉన్నాయి.

తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని..
ఒక అంకురంగా మొదలైన శ్రీ చైతన్య నేడు వటవృక్షంగా ఎదిగింది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న సీమ కూడా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇన్ఫినిటీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తండ్రి బిఎస్ రావు చూపించిన దారే కారణం. అందువల్లే శ్రీ చైతన్య నేడు ఈ స్థాయిలో ఫలితాలు అందుకోగలుగుతోంది. విద్యా విధానంలో సరికొత్త మార్పులతో పాటు.. అధునాతనమైన విధానాలను అవలంబించడంలో శ్రీ చైతన్య సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది. శ్రీ చైతన్య ఈ స్థాయిలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడానికి ప్రధాన కారణం సీమ ముందు చూపే..
అదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం
ఇన్ఫినిటీ లెర్న్ ద్వారా ఆరు నుంచి 12 తరగతి వరకు వినూత్నమైన విధానంలో విద్యాబోధన చేస్తారు. ఫౌండేషన్ టెస్ట్, ప్రిపరేషన్, గణితం, సామాన్య శాస్త్రంలో బలమైన పునాదులు వేస్తారు.. రిపీటర్లు, డ్రాపర్లూ కూడా నీట్, ఐఐటీ జేఈఈ, CUET వంటి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే లాగా చేస్తారు. పోటీ పరీక్షలకు ప్రత్యేకమైన కోర్సులు, మధునాతనమైన అభ్యాస పరిష్కారాలు, వ్యక్తిగత శ్రద్ధ, అత్యధిక నైపుణ్య ఉన్న అధ్యాపకులు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించే విధంగా చేస్తారు.
ప్రతి విద్యార్థి పురోగతి ట్రాక్
శ్రీ చైతన్యలో ప్రతి విద్యార్థి పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారు. దీనికోసం కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా విద్యార్థులు సంసిద్ధంగా ఉండేలాగా నిత్యం కనిపెట్టుకొని ఉంటారు. విద్యార్థుల మేదో వికాసానికి కృషి చేస్తుంటారు.. అంతేకాదు వ్యక్తిగతంగా ఉన్నతీకరించిన అభ్యాస మార్గాలను సృష్టించి.. సమస్యలను విద్యార్థులు నేరుగా పరిష్కరించేలాగా తర్ఫీదు ఇస్తుంటారు. అందువల్లే శ్రీ చైతన్య విద్యార్థులు ఆస్థాయిలో మార్కులు సాధించగలుగుతారు. ఈ విద్యా విధానం ప్రపంచంలో అత్యున్నత విశ్వవిద్యాలయమైన ఆక్స్ఫర్డ్ లో అందుబాటులో ఉంది.. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ మాత్రమే అమల్లో ఉంది. ఇదంతా కూడా శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సీమ ముందుచూపు వల్లే. తండ్రి వారసత్వాన్ని స్వీకరించి.. ఆయన మార్గాన్ని అనుసరించి.. ఈ స్థాయిలో శ్రీ చైతన్యను విస్తరిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం సీమ ముందు చూపే.