నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో బ్యాంక్ ఉద్యోగాలు..?

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. 150 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ఉన్న అన్ని బ్యాంక్ బ్రాంచ్ లలో ఖాళీలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 6వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. […]

Written By: Kusuma Aggunna, Updated On : March 25, 2021 4:40 pm
Follow us on

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. 150 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ఉన్న అన్ని బ్యాంక్ బ్రాంచ్ లలో ఖాళీలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 6వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలు..?

కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.bankofmaharashtra.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 48,710 రూపాయల వేతనంతో పాటు ఆలవెన్స్ లు కూడా పొందవచ్చు.

దరఖాస్తు చేసే అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు నోటిఫికేషన్ ను చదివి పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిది. సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం, సీఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి కోర్సులు చదివిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అన్ ‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1,180 రూపాయలుగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.