https://oktelugu.com/

విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఐదులో చేరితే పీజీ వరకు ఫ్రీ..!

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. విద్యార్థులు ఐదో తరగతిలో చేరితే పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మొదట్లో గురుకులాల్లో ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు ఇంటర్ వరకు మాత్రమే చదివే అవకాశం ఉండేది. మూడు సంవత్సరాల క్రితం గురుకులాలు కొత్తరూపును సంతరించుకోవడంతో పాటు డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలోని విద్యార్థులకు ఇకపై పీజీ కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి. గురుకులాల్లో పీజీ కోర్సును ప్రవేశపెట్టడంతో తెలంగాణ సర్కార్ గతంలో ప్రకటించిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2021 / 09:24 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. విద్యార్థులు ఐదో తరగతిలో చేరితే పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మొదట్లో గురుకులాల్లో ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు ఇంటర్ వరకు మాత్రమే చదివే అవకాశం ఉండేది. మూడు సంవత్సరాల క్రితం గురుకులాలు కొత్తరూపును సంతరించుకోవడంతో పాటు డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలోని విద్యార్థులకు ఇకపై పీజీ కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి.

    గురుకులాల్లో పీజీ కోర్సును ప్రవేశపెట్టడంతో తెలంగాణ సర్కార్ గతంలో ప్రకటించిన కేజీ టూ పీజీ ఉచిత విద్య స్కీమ్ అమలు దిశగా అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. ప్రతిభ ఆధారంగా గురుకులాలకు ఎంపికయ్యే విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ కోర్సులో చేరవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ గురుకుల సొసైటీకి సంబంధించి ఎంపిక చేసిన కాలేజీల్లో పీజీ, ప్రొఫెషనల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

    తొలుత దక్షిణ తెలంగాణలోని కొన్ని గురుకులాల్లో పీజీ కోర్సు అమలు కానుండగా ఆ తరువాత ఉత్తర తెలంగాణలోని కొన్ని గురుకులాల్లో పీజీ కోర్సు ప్రారంభం కానుంది. సీపీజీఈటీ పరీక్షలో లభించే ర్యాంకుల ఆధారంగా గురుకులాల్లో సీట్లు లభ్యమవుతాయని తెలుస్తోంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీలలో మూడేళ్ల క్రితం డిగ్రీ కోర్సులు ప్రారంభం కాగా ఈ కాలేజీలు పీజీ, ప్రొఫెషన్లల్ కాలేజీల స్థాయికి చేరనున్నాయి.

    ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 260 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీ మూడు కళాశాలల పరిధిలో పీజీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు చేయగా ఈ కోర్సులకు తుది ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు న్యాయవిద్య కోర్సుకు సంబంధించి బార్ కౌన్సిల్ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.