spot_img
Homeఎడ్యుకేషన్Bank Employees: ఇక నుంచి వారంలో రెండు రోజులు సెలవులు?

Bank Employees: ఇక నుంచి వారంలో రెండు రోజులు సెలవులు?

Bank Employees: సాధారణంగా ప్రతి కార్యాలయానికి వారానికి ఆరు రోజుల పని దినాలు ఉంటాయి. ఆదివారం సెలవు ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ రంగంలో మాత్రం ఐదు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. శనివారం ఆదివారం సెలవులను ఇస్తుంటారు. ఇదే విధానాన్ని ఇప్పుడు బ్యాంకులో కూడా అమలు చేయాలని ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. రోజువారి విధుల్లో ఒత్తిడి తీవ్రమవుతున్నందున వారానికి రెండు రోజులు సెలవు ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అలాగే జీతాల పెంపు తదితర డిమాండ్ల పరిష్కార ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది.

ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతిపాదనకు కేంద్రం స్పందించింది. జూలై 28న బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఈ సమావేశంలో బ్యాంకులకు ప్రతివారం రెండు రోజులు సెలవు ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వినిపిస్తుంది.

ఇప్పటివరకు బ్యాంకులకు ఆరు రోజుల పని దినాలు ఉన్నాయి‌‌. రెండు, నాలుగో శనివారం సెలవు దినాలుగా ఏర్పాటు చేశారు. అయితే మరో రెండు శనివారాలు కూడా సెలవులు ఇవ్వాలని బ్యాంకు ప్రతినిధులు కోరుతున్నారు. రోజువారి పనిగంటల్లో ఒత్తిడి మేరకు ఉద్యోగులు ఆరోగ్యం దెబ్బతింటుందని, అందువల్ల వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంచాలని కోరుతున్నారు. ఈ మేరకు బ్యాంక్ అసోసియేషన్ ప్రతినిధులు గతంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అయితే రోజువారి పని గంటల్లో పెంపునకు ఓకే అయితేనే వారానికి రెండు రోజుల సెలవులు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. వారానికి రెండు రోజులు సెలవులు కేటాయిస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసేలా సమయం మార్చుకోవాలని, అలాగైతేనే వారానికి రెండు రోజుల సెలవులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జూలై 28న బ్రాంచ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎల్ఐసి విభాగంలో వారానికి ఐదు రోజుల పని దినాలను కేటాయించారు. ఇప్పుడు తమకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని బ్యాంక్ అధికారులు కోరుతున్నారు. అయితే 28న జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని బ్యాంక్ ఉద్యోగుల తో పాటు వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper