
కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం చూపినట్టుగానే బ్యాంకింగ్ రంగానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించింది. బ్యాంకు ఉద్యోగులు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కిందకు వస్తారని, వారిని కూడా వైరస్ వెంటాడుతున్నదని బ్యాంకు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ మీడియాతో అన్నారు. కాగా 1200 మంది వరకు కరోనాతో చనిపోయి ఉంటారని అభిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఉద్యోగుల పరహారం చెల్లింపు విధానాలపై అన్ని బ్యాంకులు వివరాలు వెల్లడించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.