General Knowledge: ఆ రాష్టంలో రెండే జిల్లాలు.. అవేంటో తెలుసా?

ఇప్పటికైనా ఒక అంచనాకు వచ్చారా.. క్లూస్‌ ఆధారంగా అర్థం చేసుకోవాలి. భారత దేశంలో రెండు జిల్లాలు ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. ఉత్తర గోవా, దక్షిణ గోవా అనే జిల్లాలు మాత్రమే ఆ రాష్ట్రంలో ఉన్నాయి. గోవా భారత దేశంలో అతి చిన్న రాష్ట్రం.

Written By: Raj Shekar, Updated On : March 12, 2024 11:40 am

General Knowledge

Follow us on

General Knowledge: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అన్ని పరీక్షల్లో జనరల్‌ నాలెడ్జ్‌ చాలా ముఖ్యం. ఎక్కువగా స్కోర్‌ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు కూడా ఇదే. అదేసమయంలో అనంతమైన సబ్జెక్టు కూడా ఇదే. ఎంత చదివినా ఇంకా మిగిలే ఉటుంది. అయితే కొన్ని ముఖ్యమైన అంశాలు ఎంపిక చేసుకుని చదవితే స్కోర్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ముఖ్యమైన టాపిక్‌ జిల్లాలు. మన దేశంలో 29 రాష్ట్రాలు, అనేక జిల్లాలు ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు చాలా చిన్నవి వాటి గురించి తెలుసుకుందాం.

ఈ విషయం చాలా మందికి తెలియదు..
ఈ రోజు తెలుసుకునే అంశం నూటికి 99 మందికి తెలియదు. భారత దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే చెబుతారు. ఎన్ని జిల్లాలు అన్నా చెబుతారు. కానీ రెండు జిల్లాలు ఉన్న రాష్ట్రాలు అంటే చాలా మందికి తెలియదు. ఓ జాబ్‌ సెలక్షన్‌లో ఈ ప్రశ్న వచ్చింది. దేశంలో రెండు జిల్లాలే ఉన్న రాష్ట్రాలు ఏవని అడిగారు. ఆ రాష్ట్రాలను విదేశీయులు ఎక్కువకాలం పాలించారు. వారి ప్రభావం ఇప్పటికీ అక్కడ ఉంది.

అంచనాకు వచ్చారా…
ఇప్పటికైనా ఒక అంచనాకు వచ్చారా.. క్లూస్‌ ఆధారంగా అర్థం చేసుకోవాలి. భారత దేశంలో రెండు జిల్లాలు ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. ఉత్తర గోవా, దక్షిణ గోవా అనే జిల్లాలు మాత్రమే ఆ రాష్ట్రంలో ఉన్నాయి. గోవా భారత దేశంలో అతి చిన్న రాష్ట్రం. ఇది చాలాకాలం పోర్చుగీసు పాలనలో ఉంది. ఈ రాష్ట్రానికి 1961లో స్వాతంత్య్రం వచ్చింది. దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో గోవా ఒకటి. ఇక్కడికి విదేశీయులు కూడా ఎక్కువగా వస్తుంటారు.