Work From Home: ప్రస్తుతం ఏదైనా విషయం గురించి చెప్పుకోవాలంటే కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నట్టు చెప్పుకోవాలేమో. కాగా ఐటీ కంపెనీల్లో కూడా కరోనా వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఆన్ లైన్ మీటింగ్స్ అని, గూగుల్ మీటింగ్స్, ఆన్ లైన్ ఇంటర్వ్యూలు ఇలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అయితే వీటికి త్వరలోనే స్వస్తి చెప్పనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో అలాగే తెలంగాణలో కూడా కరోనా తగ్గుముఖం పడుతోంది. దీంతో థర్డ్ వేవ్ ముగిసినట్టే అని మొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చెప్పారు. ఐటీ కంపెనీలు కూడా తెరుచుకోవాలని సూచించారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్నటువంటి 1,500 ఐటీ కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: పానీపూరీ నీళ్లు అతిగా తాగేస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసుకోండి..!
ఏప్రిల్ 1 నుంచి ఐటీ ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని అనుకుంటున్నాయి. ఈ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 6.28లక్షల మంది ఉద్యోగులను మళ్లీ కంపెనీలకు రమ్మనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా భరోసా ఇవ్వడంతో ఈ రంగంలో నష్టపోయిన రంగాలకు మళ్లీ ఊతం ఇచ్చే దిశగా ఆఫీసులను ఓపెన్ చేయాలని హైసియా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కాగా ఈ ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది జనాభా ఊర్లలో ఉన్నారు. వారందరినీ తిరిగి రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారందరూ వచ్చి మళ్లీ అద్దె ఇండ్లు వెతుక్కునేందుకు ఇప్పటి నుంచే సమయాత్తం చేయనున్నాయి కంపెనీలు. అయితే ఒకేసారి పిలవకుండా.. వారంలో 3 నుంచి 4రోజులు ఆఫీసులుఓ పెన్ చేసి ఆ తర్వాత దశల వారీగా పూర్తిగా ఓపెన్ చేయాలని భావిస్తున్నాయంట కంపెనీలు. అయితే ఐటీ ఉద్యోగుల సంఘాలు కూడా ఇందుకు ఓకే చెబుతున్నాయి.
Also Read: నువ్వేంటి తల్లి ఇలా ఉన్నావ్.. ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా కొడతావా..!
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Endcard for work from home in hyderabad a key decision for it companies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com