NEET 2024 Admit Card : గత సంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 20 లక్షల మందికి పైగా అభ్యర్థుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)నిర్వహించింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాబోయే పరీక్ష, నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్(NEET) UG 2024 కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 గంటల వరకు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని 14 నగరాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తుంది.
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2024 కోసం రిజిస్ట్రేషన్ విండోను ఏప్రిల్ 10, 2024 వరకు తిరిగి తెరిచింది. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా ఇంగిష్‌తోపాటు అదనపు సబ్జెక్ట్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీని అభ్యసించిన విద్యార్థులు నీట్–యుజీ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. 2023, నవంబర్‌లో జారీ చేసిన పబ్లిక్ నోటీసులో, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గతంలో దరఖాస్తులు తిరస్కరించబడిన విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది. గత సంవత్సరం ఎన్‌టీఏ మే 7 భారతదేశం వెలుపల ఉన్న 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 499 నగరాల్లో ఉన్న 4,097 వేర్వేరు కేంద్రాలలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించింది. ఫలితాలు జూన్ 13న ప్రకటించింది.
అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేయడానికి దశలు:
1) మీ బ్రౌజర్‌లో https://neet.nta.nic.in/ తెరవండి.
2) పబ్లిక్ నోటీసు విభాగంలో NEET UG అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్ కోసం తనిఖీ చేయండి.
3) అవసరమైన వివరాలను నమోదు చేయండి.
4) అడ్మిట్ కార్డ్ ద్వారా వెళ్ళండి.
5) అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ప్రాసెస్‌లో ఇంకా ఎవరైనా అభ్యర్ధి ఇబ్బందులు ఎదుర్కొంటే, వారు 011–40759000ని సంప్రదించవచ్చు లేదా neet@nta.ac.in లో ఇమెయిల్ చేయవచ్చు.