Unemployment : దేశంలో నిరుద్యోగ రేటు ఏటా పెరుగుతోంది. సరైన నైపుణ్యాలు లేకపోవడం ఒక కారణమైతే.. నైపుణ్యం, అవకాశం ఉండి కూడా ఉద్యోగం సాధించలేకపోవడం మరో కారణం. అవకాశం ఉండి ఉద్యోగం సాధించకపోవడానికి నిరుద్యోగులు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే కారణం అంటున్నారు ఓ కంపెనీ సీఈవో. టాలెంట్ ఉండి కూడా ఉద్యోగం పొందలేకపోవడానికి ఆయన కారణాలు చెప్పుకొచ్చారు. Entourge కంపెనీ సీఈవో అనన్య నారంగ్ తనకు వచ్చిన ఓ జాబ్ అప్లికేషన్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ జాబ్‌కు అప్లికేషన్ దారుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. కానీ, అనుభవాలు, స్కిల్స్ చెప్పకుండా ఖాళీగా ఉంచేశాడని తెలిపారు. గూగుల్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని దానిలో తనకు తెలిసిన కొన్ని వివరాలు మాత్రం ఫిల్ చేసి మిగతావి అలాగే వదిలేశాడని పేర్కొన్నారు. సొంతంగా ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగం రాకపోవడాని ఇది ప్రధాన కారణంగా పేర్కొన్నారు. సొంత ఆలోచనా శక్తి లేనివారు.. ఉద్యోగం ఇస్తే ఎలా నెగ్గుకువస్తారని ప్రశ్నించారు.
అనన్య నారంగ్ ప్రకారం..
ఎక్స్‌లో పోస్టు చేసిన రెస్యూమ్ ప్రకారం.. ‘ఈ సందేశం మిమ్మల్ని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నా. మీరు అందిస్తున్న అవకాశాల గురించి తెలుసుకోవడానికి సంతోషిస్తున్నా. నా నైపుణ్యాలు అనుభవాలు మీ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నేను నమ్ముతున్నా’ అని ఉంది. ఇక నైపుణ్యాల కాలంలో ఎలాంటి వివరాలు పేర్కొనలేదు. ఇక్కడ గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా స్ట్రాటజీ, రీసెర్చ్ ఏదో ఒకటి వివరించాలి. ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టించడం, ట్రెండ్‌లను విశ్లేషించడం, వ్యూహాత్మక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటివి నేను ఎక్కువగా కలిగి ఉన్నాను’ అని పేర్కొన్నారు.
పూర్వపు అనుభవం..
ఇక ఇందులో పూర్వపు అనుభవం గురించి ప్రస్తావించలేదు. అనుభవం ఉన్నవారికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ అనుభవం పేర్కొనకపోవడం నిరుద్యోగికి మైనస్ అవుతుంది. అవి పేర్కొన్నకుండా..‘నేను మీ మృందానికి సహకరించడానికి, వృద్ధి చేయడానికి, ఆవిష్కరణలనుప్రోత్సహించడానికి సహాయ పడటానికి ఆసక్తిగా ఉన్నాను. మీరు నిర్మస్తున్న దానికి నేను విలువను ఎలా జోడించవచ్చో చర్చిండానికి ఇష్టపడతాను’ అని పేర్కొనడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు.