https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఈరోజు ఏదంటే అది జరుగుతుంది.. అవి ఏవంటే?

కొన్ని పనులు పూర్తి కావడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 17, 2024 / 07:51 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై గురువారం అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వజ్రయోగం ఏర్పడననుంది. దీంతో తుల, సింహ రాశుల వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. మరికొన్ని రాశుల వారికి మహా విష్ణువు అనుగ్రహం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కొన్ని పనులు పూర్తి కావడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు.

    వృషభ రాశి:
    అనారోగ్యానికి గురయ్యే అవకాశం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సోదరుల సాయంతో కొత్త పెట్టుబుడులు పెడుతారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తారు.

    మిథున రాశి:
    పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు.

    కర్కాటక రాశి:
    విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది.

    సింహారాశి:
    కొత్త స్నేహితులు ఏర్పడుతారు. అయితే వాదనలకు దూరంగా ఉండాలి. అనుకున్న పనిలో కచ్చితంగా విజయం సాధించే అవకాశం. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

    కన్య రాశి:
    వివాహ ప్రయత్నాలు సాగుతాయి. అయితే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు ఉంటాయి.

    తుల రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. మానసికంగా ఒత్తిడితో ఉంటారు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. విహార యాత్రలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులకు ధన సాయం అందుతుంది. ఆదాయం పెరగడంతో ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో కేర్ తీసుకోవాలి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది.

    ధనస్సు రాశి:
    ఉద్యోగుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు.

    మకర రాశి:
    కొత్త వ్యక్తులను అప్పుడే నమ్మొద్దు. ఆర్థిక లావాదేవీల్లో చాకచక్యంగా వ్యవహరించాలి. వ్యాపారులకు అనుకోని అదృష్టం వరిస్తుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

    కుంభరాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాహం గురించి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల నుంచి ధన సాయం అందుతుంది. ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరిచుంకోవాలి.

    మీనరాశి:
    పిల్లల విషషయంలో అద్భుతాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకుంటే కలిసి వస్తుంది. కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి.