https://oktelugu.com/

Accident: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2019 మిస్ కేరళ విజేత అన్సీ, రన్నరప్ అంజనా…

Accident: 2019 మిస్‌ కేరళ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున కారులో వెళ్తుండగా… ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ… తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ‘ఇట్స్​ టైమ్​ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది. అయితే ఆమె […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 / 02:57 PM IST
    Follow us on

    Accident: 2019 మిస్‌ కేరళ అన్సీ కబీర్‌, రన్నరప్‌ అంజనా షాజన్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున కారులో వెళ్తుండగా… ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ… తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ‘ఇట్స్​ టైమ్​ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది.

    అయితే ఆమె పోస్ట్‌ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల అందరూ వికారం వ్యక్తం చేస్తున్నారు. మిస్‌ కేరళ 2019 పోటీల నుంచే  అన్సీ, అంజనా క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారారు. ఈ పోటీలో అన్సీ విజేతగా నిలవగా… అంజనా రన్నరప్‌గా నిలిచింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ వార్తతో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చిన్న వయసులోనే వారికి ఇలా జరగడం పట్ల పలువురు ప్రముఖులు వారికి నివాళి ఆర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా నెటిజన్లు వారికి సంఘీబావాన్ని తెలియ జేస్తున్నారు.