https://oktelugu.com/

AP Govt Jobs 2022: ఏపీలో 126 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

AP Govt Jobs 2022: ఏపీ వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 126 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. https://spsnellore.ap.gov.in/ వెబ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 17, 2022 / 06:48 PM IST
    Follow us on

    AP Govt Jobs 2022: ఏపీ వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 126 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    AP Govt Jobs 2022

    https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అనుభవం. రిజర్వేషన్, పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఫిబ్రవరి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: మూడో కూట‌మిలో జ‌గ‌న్ చేరతారా? కేసీఆర్ తో క‌లుస్తారా?

    జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 51 ఉండగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 22, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 18, ల్యాబ్-టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 17, రేడియోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 3, ల్యాబ్ అటెండర్ 1, ఫిజియోథెరపిస్ట్ 2, బయో మెడికల్ ఇంజనీర్ 3, ప్లంబర్ 2, ఎలక్ట్రీషియన్ 2, కౌన్సిలర్ 3, ఆడియోమెట్రిషియన్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.15,000ల నుంచి రూ.28,000 వరకు వేతనం లభించనుంది. డీసీహెచ్‌ఎస్‌, ఏపీవీవీపీ, నెల్లూరు జిల్లా, ఏపీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

    Also Read: యూపీ అభ్య‌ర్థుల్లో నేర‌స్తులు, కోటీశ్వ‌రులే ఎక్కువా?