Mohan Babu Son of India Movie Review : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మోహన్ బాబు హీరోగా వస్తున్నారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దేశభక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్ గా రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ , ఇండియాలో కొన్ని స్పెషల్ షోలు పడడంతో ఈ మూవీ ఎలా ఉందో ‘రివ్యూ’లోకి వెళ్లి తెలుసుకుందాం..
కథ:
మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు సన్నాఫ్ ఇండియా చిత్రం ద్వారా మోహన్ బాబు పరిచయం చేయబోతున్నాడు. దేశభక్తి ప్రధానంగా చిత్రం రూపొందింది. ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. డబ్బున్నోడికి ఓ న్యాయం.. డబ్బులేనోడికి ఓ న్యాయం పవర్ ఉన్నోడికి ఓ న్యాయం.. పవర్ లేనోడికి ఒక న్యాయం.. ఈ ప్రజాస్వామ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా చిత్రం తీశారు. ప్రజాస్వామ్యంలోని క్రిమినల్స్ తో పోరాడే వీరుడిగా మోహన్ బాబు నటించారు. విలన్లను ఏరివేశారా? లేదా? విలన్లు ఈయనను ఎలా ఎదుర్కొన్నారన్నదే కథ.
-విశ్లేషణ
మోహన్ బాబు ఇందులో దేశభక్తికి వ్యతిరేకంగా చేసే మోసగాళ్లను ఏరివేస్తుంటాడు. యంగ్ మోహన్ బాబు పాత్రలో మంచు విష్ణు నటించారు. చాలా ఏళ్ల తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా రూపొందుతున్న ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రంలో మోహన్ బాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ అనిపించుకుంటారా అంటే ఈ సీరియస్ డ్రామాకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టమేనని చెప్పొచ్చు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై పోరాటం చేసే పాత్రలో మోహన్ బాబు వీరావేశం చూపించారు.
దాదాపు 500 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో మెప్పించిన మోహన్ బాబు ఇప్పుడు సన్నాఫ్ ఇండియా అంటూ దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటించారు.
-సాంకేతిక విలువలు
ఎక్కడా ప్రొడక్షన్ పరంగా కాంప్రమైజ్ కాకుండా తీశారు. చాలా ఏళ్ల తర్వాత మోహన్ బాబు పవర్ ఫుల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని గమనించి కథ, కథనాన్ని సీరియస్ గానే మలిచారు. మన అంచనాలకు అందని ఓ వ్యక్తి సమాజంలోని క్రిమినల్స్ ను ఎలా ఏరివేస్తాడన్నది ఆసక్తిగా రిచ్ గా చూపించారు. ఇలయరాజా సంగీతం బాగుంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రీఫీ అలరిస్తుంది.
ఓవరాల్ గా చిత్రంలో మోహన్ బాబు సీరియస్ దేశభక్తుడిగా కనిపించారు. ప్రేక్షకులకు ఇది బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. కానీ సీరియస్ ఎక్కువ కావడంతో ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుందో చూడాలి.