CUET PG Result: జాతీయస్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(CUET-PG 2024) కోర్సులలో ప్రవేశానికి గానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పష్టత ఇచ్చింది. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉందని యూజీసీ(University grants commission) చైర్మన్ జగదీష్ కుమార్ ప్రకటించారు.. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది..పోస్ట్ గ్రాడ్యుయేషన్(CUET-PG 2024) లో సాధించిన స్కోర్ ఆధారంగా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది.. గత మార్చి నెల 28న CUET-PG ప్రవేశ పరీక్షలను భారత ప్రభుత్వం నిర్వహించింది. 4,62,725 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఈ ప్రవేశ పరీక్షలను భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించింది. 7,68,414 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు..
మార్చి 11 నుంచి 23 వరకు, మార్చి 27 నుంచి 28 తేదీల్లో ఆన్లైన్ విధానంలో భారత ప్రభుత్వం ఈ పరీక్షలను నిర్వహించింది. 253 నగరాల్లో ఏర్పాటుచేసిన 565 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. భారత్ మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లోని మనామా, ఖాట్మండు, దుబాయ్, మస్కట్, రియాద్, ఒట్టావా, అబుదాబి, వియన్నా, దోహా ప్రాంతాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.. 2022లో కేంద్ర ప్రభుత్వం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్రం, రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అభ్యర్థులకు అడ్మిషన్ లభిస్తుంది.
ఇక ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలంటే CUET-PG వెబ్ సైట్(pgcuet. Samarth) లోకి లోకి వెళ్లాలి. అందులో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది.. దాన్ని క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆన్సర్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 12న CUET-PG ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది. అంతేకాకుండా అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఏప్రిల్ 7 వరకు గడువు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు అభ్యర్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
CUET-PG ద్వారా కేంద్రం, రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులలో సీట్లు భర్తీ చేస్తారు. 38 కేంద్ర, 38 రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలు CUET-PG పరీక్ష రాసిన అభ్యర్థులకు సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. CUET-PG పరిధిలో 105 ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.. పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
NTA is working to announce the CUET-PG results by tonight. These scores are used for admission to various PG programmes at several Indian universities. Good luck to all those who sat for CUET-PG. pic.twitter.com/giJYqqMOrJ
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 12, 2024