Homeఎంటర్టైన్మెంట్Manchu Manoj: తండ్రైన మంచు మనోజ్... అబ్బాయా? అమ్మాయా? అంటే!

Manchu Manoj: తండ్రైన మంచు మనోజ్… అబ్బాయా? అమ్మాయా? అంటే!

Manchu Manoj: గత ఏడాది మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికతో ఆయన వివాహం జరిగింది. మార్చి 3న హైదరాబాద్ లోని మంచు లక్ష్మి నివాసంలో పెళ్లి చేసుకున్నారు. మూడు రోజులు పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు మనోజ్ తండ్రి మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదనే వాదన వినిపించింది. అయితే చివరి క్షణాల్లో వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మనోజ్ అన్నయ్య విష్ణు మాత్రం పెళ్ళికి దూరంగా ఉన్నాడు.

కొద్దిరోజుల క్రితం మౌనిక గర్భం దాల్చిన విషయం మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. త్వరలో తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఏప్రిల్ 13 శనివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మౌనిక ప్రసవించింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది.

మనోజ్ కుటుంబంలో ఇప్పుడు నలుగురు సభ్యులు ఉన్నారు. దేవుని దయతో మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ధైరవ్ నేడు అన్నయ్య అయ్యాడు. మేము ముద్దుగా ఈ పాపను ఎంఎం పులి అని పిలుచుకుంటాము. ఆ శివుని దయ ఈ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి… అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. మనోజ్ కి బంధు మిత్రులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మనోజ్ మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అలాగే భూమా మౌనిక బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి సంతానం. పేరు ధైరవ్. భర్తతో విడాకులు అనంతరం ధైరవ్ అమ్మ వద్దే పెరుగుతున్నాడు. మనోజ్ ధైరవ్ ని భగవంతుడు ప్రసాదించిన బిడ్డగా అభివర్ణించాడు.

RELATED ARTICLES

Most Popular