సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. మొత్తం 2439 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. మొత్తం 2439 ఉద్యోగ ఖాళీలలో సీఆర్‌పీఎఫ్ 1537, బీఎస్‌ఎఫ్ – 365, ఏఆర్ – 156, ఎస్‌ఎస్‌బీ – 251, ఐటీపీబీ 130 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
సీపీఎఫ్ లో లేదా ఎక్స్ ఆర్మీ ఉద్యోగిగా పని చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు సీఏపీఫ్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి. 62 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత, ఆసక్తి కలిగి ఉంటారో వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరైతే మంచిది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ మధ్య ఈ ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్లాలి.
https://crpf.gov.in/recruitment-details.htm?194 లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. డిగ్రీ, వయసు నిర్ధారణ, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్లతో పాటు రిటైర్‌మెంట్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు ఆ సర్టిఫికెట్లను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.