Colliers India: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటైన కొలియర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వచ్చే సంవత్సరం ఏకంగా 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ సంస్థ సిద్ధమైంది. అన్ని స్థాయిలలో ఉద్యోగుల నియామకం జరగనుందని తెలుస్తోంది. 2022 సంవత్సరంలో ఈ సంస్థ రెండు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
Also Read: రైల్వేలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
కరోనా వ్యాక్సినేషన్ వేగం పెరగడంతో ఆఫీసులు, షాపింగ్ మాల్స్ కు సంబంధించి అభివృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్ లో మార్కెట్ ను పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. మన దేశంలోని మూడు రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సంస్థలలో ఈ సంస్థను కూడా ఒకటిగా నిలపాలని నాయర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బ్రాండ్‌ను మార్కెట్ చేయడం, వినూత్న సాంకేతికతలను అమలు చేయడం, శ్రామిక శక్తిని పెంచడం, సరైన పని సంస్కృతిని అలవర్చుకోవడం ద్వారా సంస్థను అభివృద్ధి మార్గంలో నడిపించాలని నాయర్ భావిస్తున్నారు.
మరోవైపు వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. కొత్త రిక్యూట్ మెంట్ల దిశగా దేశంలోని ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీలు సైతం అడుగులు వేస్తున్నాయి. రోజురోజుకు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుండగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు భారీగా లాభాలు సొంతమవుతున్నాయి. ప్రధాన నగరాలలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు.
Also Read: అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. అర్హులెవరంటే?