
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 361 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ , భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ లో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం.
ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 30 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కోల్ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని సమాచారం.
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://coalindia.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఉన్న అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కంపెనీ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది.