
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 13 ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది కాలపరిమితికి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. https://cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి.
https://cdac.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డాట్‌నెట్, ఎంక్యూటీటీ ప్రొటోకాల్స్, జావా 8, జావా 11పై నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
37 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం జూన్ 26వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుందని తెలుస్తోంది.