
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పీహెచ్‌పీ డెవలపర్, సీనియర్ డెవలపర్ అనలిటిక్స్, డిజైనర్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 1 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.dic.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తం 16 ఉద్యోగ ఖాళీలలో సీనియర్ డెవలపర్ ఉద్యోగ ఖాళీలు 3, డెవలపర్ ఉద్యోగ ఖాళీలు 6, సాఫ్ట్‌వేర్ టెస్టర్ కమ్ డెవలపర్ 2, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1, కంటెంట్ మేనేజర్ లేదా రైటర్ 1, డిజైనర్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్నవాళ్లు డిజైనర్, కంటెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏ చేసిన వాళ్లు మిగిలిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.