నిరుద్యోగులకు శుభవార్త.. కెనరా బ్యాంకులో 220 ఉద్యోగాలు..?

దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ కర్ణాటక ప్రధాన కేంద్రంగా నడుస్తోంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 25వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 25 చివరి తేదీగా ఉంది. కెనరా బ్యాంక్ విడుదల చేసిన ఉద్యోగాలలో డేటా […]

Written By: Navya, Updated On : November 22, 2020 8:52 am
Follow us on


దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ కర్ణాటక ప్రధాన కేంద్రంగా నడుస్తోంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 25వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 25 చివరి తేదీగా ఉంది.

కెనరా బ్యాంక్ విడుదల చేసిన ఉద్యోగాలలో డేటా మైనింగ్ ఎక్స్ ‌ప‌ర్ట్, కాస్ట్ అకౌంటెంట్, సీనియ‌ర్ మేనేజ‌ర్, ఎస్ఓసీ అడ్మినిస్ట్రేట‌ర్‌, మేనేజ‌ర్‌, బీఐ స్పెష‌లిస్ట్, ఇతర విభాగాలు ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచ్ లలో చదువుకుని ఉంటే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

https://www.canarabank.com/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్లు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి భవిష్యత్ ఉంటుంది.

వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరుసగా విడుదలవుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.