https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ పశుపాలన్‌ లో ఉద్యోగాలు..?

దేశంలో నిరుద్యోగుల సంఖ్య సంవత్సరం సంవత్సరానికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల గతేడాది కొన్ని నెలల పాటు ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటంతో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తాజాగా నిరుద్యోగులకు భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..? వివిధ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 12, 2021 / 10:52 AM IST
    Follow us on

    దేశంలో నిరుద్యోగుల సంఖ్య సంవత్సరం సంవత్సరానికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల గతేడాది కొన్ని నెలల పాటు ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడటంతో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తాజాగా నిరుద్యోగులకు భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..?

    వివిధ విభాగాలకు సంబంధించి 3,216 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. bhartiyapushpalan.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: ఐడీబీఐ బ్యాంక్ శుభవార్త.. భారీ వేతనంతో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు..?

    దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, ఎఫీసియెన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలలో అర్హత సాధించిన వాళ్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. మొత్తం 3,216 ఖాళీలలో సేల్స్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలు 64, సేల్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 485, సేల్స్‌ హెల్పర్‌ ఉద్యోగ ఖాళీలు 2667 ఉన్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కాగా సేల్స్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఇంటర్, సేల్స్‌ హెల్పర్‌ పోస్టులకు పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లకు ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది.