BPCL Recruitment 2021: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 87 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అప్రెంటీస్ మరియు టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.bharatpetroleum.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 42 ఉండగా కెమికల్ ఇంజనీర్ 11, సివిల్ ఇంజనీర్ 8, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 5, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లేదా ఐటీ – 3, ఇన్ స్ట్రుమెంటర్ ఇంజనీరింగ్ -2, మెకానికల్ ఇంజనీరింగ్ 13 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 6.3 జీపీఏ వచ్చిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5.3 జీపీఏ వచ్చినా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు 45 టెక్నీషియన్ డిప్లొమా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ లో డిప్లొమా పాసై 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు, 50 శాతం మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.bharatpetroleum.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,000 రూపాయలకు పైగా వేతనం లభించనుంది. డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18,000 రూపాయలకు పైగా వేతనం లభించనుంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.