Best Courses After Intermediate: ఇంటర్ తరువాత తొందరగా జాబ్ వచ్చే కోర్సులు ఇవే..

ఇప్పుడంతా డిజిటల్ యుగం ప్రతి ఒక్కరూ ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే మొబైల్ లో సెర్చ్ చేస్తున్నారు. వారికి సేవలు అందించడానికి కొన్ని ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో పనిచేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్సు చేయాల్సి ఉంటుంది.ఈ కోర్సు 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్ లైన్ లోనూ దీనిని నేర్చుకోవచ్చు.

Written By: Chai Muchhata, Updated On : May 11, 2023 8:59 am
Follow us on

Best Courses After Intermediate: చదువుకునే ప్రతి ఒక్కరికి ఇంటర్.. జీవితానికి బార్డర్ లాంటింది. వీరు భవిష్యత్ ను బంగారు బాట వేసుకోవాలనుకుంటే ఇక్కడే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న నిర్ణయంతోనే వారి జీవితం ముడిపడి ఉంటుంది. చాలా మంది ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకొని జీవితంలో సక్సెస్ సాధించారు. కొందరు మిస్టేక్ చేసి మిగతా వారి కంటే కింది స్థాయిలో ఉన్నారు. అందువల్ల ఇంటర్ పూర్తయిన తరువాత ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి? ఆ తరువాత ఏం చేయాలి? అనేది కీలకం. మరి ఇంటర్ తరువాత మంచి కోర్సులు ఏంటి? త్వరగా జాబ్ కొట్టడానికి మార్గాలేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ మార్కెటింగ్ కోర్సు:
ఇప్పుడంతా డిజిటల్ యుగం ప్రతి ఒక్కరూ ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే మొబైల్ లో సెర్చ్ చేస్తున్నారు. వారికి సేవలు అందించడానికి కొన్ని ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో పనిచేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్సు చేయాల్సి ఉంటుంది.ఈ కోర్సు 3 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్ లైన్ లోనూ దీనిని నేర్చుకోవచ్చు. అయితే కొన్నాళ్ల పాటు పార్ట్ టైం చేసి ఆ తరువాత ఎగ్జిక్యూటివ్ లెవల్లోకి మారవచ్చు.

వెబ్ డిజైనింగ్:
ప్రతి ఒక్కరూ నేటి కాలంలో ఓ వెబ్ సైట్ పెట్టుకుంటున్నారు. కానీ వారికి వెబ్ సైడ్ డిజైన్ చేయడం తెలియదు. అలాంటి వారి కోసం వెడ్ డిజైనర్ల అవసరం ఉంటుంది. అందువల్ల వెబ్ డిజైన్ నేర్చుకుంటే మంచి ఉపాధి లభిస్తుంది. దీనికి ఇంటర్ ఉంటే చాలు. వెబ్ డిజైనింగ్ నేర్చుకున్న తరువాత పెద్ద పెద్ద సంస్థల్లోనూ పనిచేయొచ్చు. సొంతంగా క్రియేట్ చేసి ఇవ్వొచ్చు.

ఫొటోగ్రఫీ:
ఈరోజుల్లో ఫొటోగ్రఫీ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. మంచి ఫొటో కావాలనుకుంటే ఫొటోగ్రాఫర్ల అవసరం ఉంటుంది. ఇందులో కొన్ని ప్రత్యేకమైన కోర్సులు చేయడం ద్వారా కొత్త తరహాలో ఫొటోలు తీసి వినియోగదారులను ఆకర్షించుకోవచ్చు. అలాడే వీడియోతీయడంలోనూ మెళకువలు నేర్చుకుంటే సినిమాల్లోకి వెళ్లవచ్చు.

హోటల్ మేనేజ్మెంట్:
12 తరువాత చాలా మంది ఈ కోర్సు ఇప్పుడు బాగా మంది చేస్తున్నారు. 3 సంవత్సరాల కోర్సు చేసిన తరువాత పెద్ద పెద్ద హోటళ్లతో పాటు విదేశాల్లోనూ మంచి జాబ్ కొట్టేయవచ్చు. ఈ కోర్సు 6 నెలల నుంచి 1 సంవత్సరం ఉంటుంది. అయితే దీని తరువాత అడ్వాన్స్ , డిప్లోమా కోర్సులు చేసి మేనేజర్ లెవల్లో జాబ్ లు పొందవచ్చు.