
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 90 వేల రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2021 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది.
Also Read: నిరుద్యోగులకు ఈసీఐఎల్ శుభవార్త.. రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..!
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి షార్ట్ లిస్ట్ అయిన వారికి రాత పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 52 ఖాళీలలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఈఏటీ) ఉద్యోగాలు 25 ఉండగా టెక్నీషియన్ సీ ఉద్యోగ ఖాళీలు 27 ఉన్నాయి. 2021 సంవత్సరం ఫిబ్రవరి 1 నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
Also Read: తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..?
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ ఉద్యోగాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉద్యోగ ఖాళీలు 14, మెకానికల్ 10, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. టెక్నీషియన్ సీ ఉద్యోగాలలో ఎలక్ట్రో మెకానిక్ 17 ఖాళీలు, మెషినిస్ 6 ఖాళీలు, ఫిట్టర్ 3 ఖాళీలు, వెల్డర్ ఒక ఖాళీ ఉంది. ఎస్ఎస్ఎల్‌సీ + ఐటీఐ + ఏడాది అప్రెంటిస్ షిప్ పూర్తి చేసిన వాళ్లు, మూడు సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్ షిప్ కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.