https://oktelugu.com/

బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో బెల్ లో ఉద్యోగాలు..?

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. బెంగళూరు, మచిలీపట్నం యూనిట్లలో ఉన్న 79 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బెల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్‌, ట్రెయినీ ఇంజినీర్ పోస్టులతో పాటు ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: టెన్త్‌, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 16, 2021 / 12:30 PM IST
    Follow us on

    భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. బెంగళూరు, మచిలీపట్నం యూనిట్లలో ఉన్న 79 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బెల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్‌, ట్రెయినీ ఇంజినీర్ పోస్టులతో పాటు ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: టెన్త్‌, ఇంటర్‌ పాసైన వాళ్లకు శుభవార్త.. నేవీలో ఉద్యోగాలు..?

    మొత్తం ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రెండు సంవత్సరాల ఇండస్ట్రియల్ అనుభవం కచ్చితంగా ఉండాలి. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తొలి ఏడాది రూ.35000 వేతనం లభిస్తుంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఒక్క మెసేజ్‌తో ఉద్యోగాలు తెలుసుకునే ఛాన్స్..?

    ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 33 ఉండగా ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు 6 నెల‌ల‌ పోస్టు క్వాలిఫికేష‌న్ ఇండ‌స్ట్రియ‌ల్ అనుభ‌వం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి 1 నాటికి 25 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తొలి ఏడాది 25,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ట్రెయినీ ఇంజినీర్ (సివిల్‌) ఉద్యోగాలకు , ట్రెయినీ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌‌) ఉద్యోగాలకు 16 ఖాళీలు ఉండగా ఆరు నెలల ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయవచ్చు. బెల్‌- మ‌చిలీప‌ట్నంలో ట్రెయినీ ఇంజినీర్ల ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.