https://oktelugu.com/

Vacancies In AP Govt Hospital: ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.52 వేల వేతనంతో?

Vacancies In AP Govt Hospital: ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. మొత్తం 53 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 29, 2022 / 09:15 AM IST
    Follow us on

    Vacancies In AP Govt Hospital: ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. మొత్తం 53 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

    Jobs

    18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. బయో మెడికల్‌ ఇంజనీర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు పోస్టు మార్టం అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషిన్‌, ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌ ఉద్యోగ ఖాళీలను ఆడియో మెట్రీషియన్‌, రేడియోగ్రాఫర్లు, థియేటర్‌ అసిస్టెంట్‌, ఫార్మసిస్ట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    Also Read: Raj Tarun: బ్యాడ్ టైంలో గొప్ప అవకాశం.. ఫామ్ లోకి వస్తాడా ?

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 15,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా అనుభవం కలిగి ఉండటంతో పాటు ఏపీ పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. అనుభవం, రిజర్వేషన్‌, మెరిట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ఆఫ్‌లైన్‌ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సంస్థ విశాఖపట్నం అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. మార్చి 31వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా https://visakhapatnam.ap.gov.in/ లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు కాగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 300 రూపాయలుగా ఉంది.

    Also Read: Samantha Social Media Promotions: ఒక్కో పోస్ట్ కే ‘సమంత’ అంత అడుగుతుందా ?