
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ఏపీ వైద్య విధాన పరిషత్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థులు మాత్రం 1,500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెల 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://cfw.ap.nic.in/ లేదా https://apvvp.nic.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
https://dmeaponline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులలో 453 పోస్టులు ఉండగా మొత్తం పోస్టులలో గైనకాలజీ 269, పీడియాట్రిక్స్ 11, అనెస్తీషియా 64, జనరల్ మెడిసిన్ 30, జనరల్ సర్జరీ 16, ఆర్థోపెడిక్స్ 12, పాథాలజీ 5, ఆప్తాల్మాలజీ 9, రేడియాలజీ 21, సైకియాట్రీ 2, డెర్మటాలజీ 1, ఈఎన్‌టీ 8 ఉద్యోగ ఖాళీలున్నాయి.
సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.53,500 వరకు వేతనం లభిస్తుంది.