https://oktelugu.com/

సినిమా షూటింగ్ లపై టాలీవుడ్ కీలక నిర్ణయం

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికి రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. జనంలో కూడా భయం తగ్గింది. ఎలాగూ వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. పైగా వచ్చేవారం నుంచి తెలంగాణాలో లాక్ డౌన్ ఉండదు అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కంటిన్యూ చేసినా.. జులై నుంచి అది కూడా తీసేసే అవకాశం ఉంది. అందుకే సినిమా వాళ్ళు మళ్ళీ షూటింగ్ ల పై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2021 / 08:18 PM IST
    Follow us on

    కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికి రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. జనంలో కూడా భయం తగ్గింది. ఎలాగూ వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. పైగా వచ్చేవారం నుంచి తెలంగాణాలో లాక్ డౌన్ ఉండదు అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.

    ఒకవేళ రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం కంటిన్యూ చేసినా.. జులై నుంచి అది కూడా తీసేసే అవకాశం ఉంది. అందుకే సినిమా వాళ్ళు మళ్ళీ షూటింగ్ ల పై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ తాజాగా షూటింగ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది.

    కరోనాతో నిలిచిపోయిన సినిమాల షూటింగ్ ను మొదలుపెట్టాలని టాలీవుడ్ డిసైడ్ అయ్యింది. తాజాగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గురువారం సమావేశమైంది. షూటింగ్ లపై నిర్ణయానికి వచ్చింది.

    ప్రస్తుతానికి తుదిదశలో ఉన్న సినిమా చిత్రీకరణలు పూర్తి చేయాలని ప్రకటించింది. ఆ తర్వాతే కొత్త సినిమాల షూటింగ్ లు ప్రారంభించాలని సూచించింది. ముఖ్యంగా ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు జులై ఫస్ట్ వీక్ నుండి షూట్ కి రెడీ అయ్యాయి. ఆల్ రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాల కోసం భారీ సెట్స్ కూడా వేశారు.

    ఇక షూటింగులకు హాజరయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యుల నుంచి నిర్మాణ సంస్థలు కరోనా టీకా తీసుకున్నట్లు నిర్ధారించాకే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఒక్క డోసు వేసుకున్నవారిని కూడా షూటింగ్ లకు అనుమతించాలని తీర్మానించారు.

    ఆగిపోయిన సినిమాలకు సంబంధించి దర్శకులు తమ షెడ్యూల్ ను కుదించుకొని వీలైనంత తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసేలా చూడాలని నిర్ణయించింది. షూటింగ్ లలో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ కండీషన్ విధించింది. దీంతో ఇక టాలీవుడ్ మూవీలు పట్టాలెక్కినట్టుగానే తెలుస్తోంది.