
ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 46 బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రిన్సిపాల్, టీజీటీ, కేర్ టేకర్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆగష్టు 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మెరిట్ లిస్ట్ ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేయడం జరుగుతుంది. https://welfarerecruitments.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలనుతెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై నెల 22వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 16వ తేదీలోపు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభించనుంది. ప్రిన్సిపాల్ గ్రేడ్ 2 విభాగంలోని ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల వరకు వేతనం లభించనుంది. టీజీటీ విభాగంలో ఉద్యోగ ఖాళీల కోసం ఎంపికైన వారికి 28,490 రూపాయల నుంచి 78,910 రూపాయల వరకు వేతనం లభించనుంది. కేర్ టేకర్ లేదా వార్డెన్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 21,200 రూపాయల నుంచి 63,010 రూపాయల వరకు చెల్లించనున్నారు.
60 శాతం మార్కులతో పీజీ, 50 శాతం మార్కులతో బీఈడీ చేసిన వాళ్లు ప్రిన్సిపాల్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు టెట్ 2 పేపర్ పాసై ఉండటంతో పాటు పీజీ తో పాటు బీఈడీ చేసి ఉంటే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు కేర్ టేకర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
భారీ వేతనం లభించే ఉద్యోగ ఖాళీలు కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా సులువుగా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.