
ఏపీ విద్యార్థులకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి జగనన్న సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2021 కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే విద్యార్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆసక్తి ఉన్న విద్యార్థులు మే నెల 18వ తేదీలోగా ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఈ ఫెలోషిప్ కు అర్హత పొందవచ్చు. ఐఎస్‌బీ, ఐఐటీ, ఎస్‍పీఏ, ఎన్ఐటీ, బిట్స్, ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న వాళ్లు ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఈ ఫెలో షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
షార్ట్‌లిస్టింగ్, ప్యానెల్ ఇంటర్వ్యూ ద్వారా ఫెలోషిప్ కు విద్యార్థులను ఎంపిక కావడం జరుగుతుంది. మూడు నెలల ఫెలోషిప్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు jaganannafellowship@apssdc.in ఈమెయిల్ కు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. https://www.apssdc.in/ వెబ్‌సైట్ ద్వారా ఫెలోషిప్ కు సంబంధించిన పూర్తి వివారాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 21,22వ తేదీలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
మే నెల 26వ తేదీన విద్యార్థుల తుది ఎంపిక జరుగుతుంది. జూన్ 1 నుంచి ఫెలోషిప్ స్టార్ట్ అవుతుంది. ఫెలోషిప్ కు ఎంపికైన విద్యార్థులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది.