https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో ఎయిర్ టెల్ లో ఉద్యోగాలు..?

కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులలో ఎక్కువమంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. అయితే నిరుద్యోగులకు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ 60 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఎయిర్ టెల్ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ కొరకు పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 5, 2021 / 10:37 AM IST
    Follow us on

    కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులలో ఎక్కువమంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. అయితే నిరుద్యోగులకు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్ టెల్ 60 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

    ఎయిర్ టెల్ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ కొరకు పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కొరకు అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు జూన్ నెల 8వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 4జీ ఛాంప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. పది పాసైన వాళ్లతో పాటు ఫెయిలైన వాళ్లు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉండాలి. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు వైజాగ్, ఆనందపురం, భీమిలి, సబ్బవరం, పెందుర్తి, గోపాలపట్నం, తగరపువలస, కోటపాడు, గాజువాక, అనకాపల్లిలో పని చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.