Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.90 వేల వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

Jobs: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీలోని నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 19, 2022 5:38 pm
Follow us on

Jobs: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీలోని నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత స్పెషలైజేషన్ లో తత్సమాన ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

Also Read: CM KCR- National Politics: కల చెదిరే.. ఒంటరిగా మిగిలిపోయిన కేసీఆర్!?

మొత్తం 600 మార్కులకు ఆరు పేపర్ల ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారని బోగట్టా. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://psc.ap.gov.in/(s(cemu4h5ixehsweet5dl4mazc))/default.aspx లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మే 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

Also Read: Pragathi: లేటు వ‌య‌సులో ఘాటు అందాలు.. ప్ర‌గ‌తి బ‌ర్త్‌డే ఫోజులు చూస్తే మ‌తి పోవాల్సిందే..

Recommended Videos: