Homeఎడ్యుకేషన్NEET State Ranks: ఏపీ, తెలంగాణ నీట్‌–యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు విడుదలయ్యాయి.. మీరు చెక్‌...

NEET State Ranks: ఏపీ, తెలంగాణ నీట్‌–యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు విడుదలయ్యాయి.. మీరు చెక్‌ చేసుకోండి.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల!

NEET State Ranks: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నీట్‌ తుది ర్యాంకులను విడుదల చేసింది. జాతీయస్థాయిలో ర్యాంకులను ఇటీవలే విడుదల చేసిన ఎన్‌టీఏ.. తాజాగా డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్ట్‌ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితా ప్రకటించాయి. దీనికి అనుగుణంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆగస్టు 14 నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్సేషన్‌ ప్రారంభమవుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ సంస్థ ప్రకటించిన తేదీల్లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.

దేశవ్యాప్తంగా 1.10 సీట్లు..
దేశవ్యాప్తంగా 710 మెడికల్‌ కశాళాలలు ఉన్నాయి. వీటిలో 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటి క ఓసమే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నీట్‌ పరీక్ష నిర్వహించింది. వీటితోపాటు 21,000 బీడీఎస్‌ సీట్లతోపాటు ఆయుష్, నర్సింగ్‌ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిçప్‌మర్‌లోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు.

ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 720 మార్కులకు ఆన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161–127, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూబీడీ) విభాగాల్లో 143–127 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 43,788 మంది ర్యాంకులను ప్రకటించామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణలో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127, ఓసీ– పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌ ప్రకటించారు. మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించామని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఆలిండియా కోటా సీట్లకు మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:

– రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఆగస్టు 14 నుంచి 20 వరకు.

– సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: ఆగస్టు 21, 22.

– సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: ఆగస్టు 23.

– సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: ఆగస్టు 24 నుంచి 29వ వరకు.

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

– రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు.

– సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: సెప్టెంబరు 11, 12.

– సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: సెప్టెంబర్‌ 13.

– సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు.

మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:

– రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు.

– సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: అక్టోబరు 3 నుంచి 4 వరకు.

– సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: అక్టోబరు 5.

– సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: అక్టోబర్‌ 6 నుంచి 12 వరకు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular